చెత్త పలుకుల సుత్తి రాతలు..! బాధాకృష్ట కమ్మని కారు కూతలు..!!

345

తమ చెత్త పలుకు చదువుతుంటే?దెయ్యాలు వేధాలు వల్లించినట్లు, వ్యభిచారిని పతివ్రత కబుర్లు చెప్పినట్లుంటుంది!!

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి… కమ్మ కుల ద్వేషి అని నమ్మించడానికి బాధాకృష్ణ చాలా ప్రయత్నించడం షరా మామూలైంది!!ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిపై కలం పారేసుకున్నారు. పెట్టిన పేపర్, చేతులో పెన్ను ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు రాసుకొచ్చారు.

ఇంకా ఆయన ఇలా అన్నారు..ఈయన ఇలా అన్నారు. చెప్పుకొస్తే… తన బుర్రలో సీఎం జగన్ మీద ఉన్న ద్వేషాన్ని వెళ్లగక్కు తుంటారు బాధాకృష్ణ. చెత్త పలుకులో పెద్ద కామెడీ ఏమంటే!చంద్రబాబుకు, నిమ్మగడ్డ రమేష్‌కు సరిపడదటా..!!2020లో ఇంత కంటే పెద్ద జోక్ ఇంకొకటి ఉండదు…!!!కరోనా వైరస్‌ కంటే ప్రమాదకరం బాధాకృష్ణ కలం!

చంద్రబాబుకు, నిమ్మగడ్డ రమేష్‌కు సరిపడదు అంటున్నారు సరే మరీ…నిమ్మగడ్డ రమేష్‌ కూతురు శరణ్యకు చంద్రబాబు ప్రభుత్వ పదవి ఎందుకు ఇచ్చారో?!చంద్రబాబు విదేశీ టూర్లను పర్యవేక్షించింది నిమ్మగడ్డ రమేష్ కూతురే కదా?చంద్రబాబు నాయుడు స్పెషల్ ప్లైయిట్స్‌లో …నిమ్మగడ్డ రమేష్‌ కూతురు విదేశాలకు వెళ్లింది నిజం కాదా?!అంతేకాదు..అమరావతిలో నిమ్మగడ్డ కూతురుకు 15 ఎకరాలు, విశాఖలో నిమ్మగడ్డ రమేష్‌కు భూములు ఉన్నాయని వార్తలు వచ్చాయ్!!నిప్పులేనిది పొగరాదు కదా?మీరు చెప్పినట్లే చంద్రబాబుకు, నిమ్మగడ్డ రమేష్‌కు సరిపడకపోతే?స్టేట్ ఎలక్షన్‌ కమిషనర్ కూతురు శరణ్యను చంద్రబాబు నెత్తిన ఎందుకు పెట్టుకుంటారు?!ఏపీలో శరణ్య కంటే తెలివైన వారు, కార్పొరేట్ కల్చర్‌ తెలిసిన వాళ్లు చాలా మంది ఉన్నారు. వారిని చంద్రబాబు పదవులతో సత్కరించవచ్చు కదా..?!. నిమ్మగడ్డ రమేష్‌ కూతురు శరణ్యనే ఎందుకు చంద్రబాబు తన ప్రభుత్వంలో అవకాశమిచ్చారు. నిమ్మగడ్డ రమేష్‌తో ఉన్న సత్ససంబంధాలు వల్ల కాదా?. “నేను మీకుటుంబానికి ఇది చేశాను..ఇప్పుడు నాకు ఇది చేయి ” అనే పొలిటికల్క్విడ్ ప్రోకో చంద్రబాబు, నిమ్మ గడ్డ రమేష్‌ మధ్య జరిగినట్లు స్పష్టంగా అర్ధమవుతుంది కదా?. సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బాధాకృష్ణకు బుర్ర పనిచేయడంలేదేమో అనిపిస్తోంది. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి మీద లేనిపోని వార్తలు వండటానికి బాధాకృష్ణ తన సమయాన్ని చాలా ఎక్కువుగా కేటాయిస్తున్నట్లు కూడా అర్ధమవుతుంది. తాను రాసిన ఆర్టికల్ ప్రజలు చదివి నమ్ముతారని బాధాకృష్ అనుకుంటున్నారు. మీ వార్తలు, మీ ఆర్టికల్స్‌ ప్రజలు చదవుతారు.కాని నమ్మరు. మీ ఆర్టికల్ చదివి ప్రజలు…కాసేపు ఆదివారం పూట నవ్వుకుంటారు. ఏపీలో ఏ ప్రభుత్వ కార్యాలయంలోకి వెళ్లినా ‘‘మీరు కమ్మవాళ్లయితే మీకు పని కాదు.. మాకు ఆ మేరకు ఆదేశాలున్నాయి’’ అని అధికారులు మొహమాటం లేకుండా చెబుతున్నారని బాధాకృష్ణ రాసుకొచ్చారు. కాని..నాకు అధికారులు, వైఎస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు, అభిమానులు మరో విధంగా చెబుతున్నారు.వైఎస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వంలో కూడా టీడీపీ వాళ్లకే పనులు అవుతున్నాయని చెబుతున్నారేమి?!. బాధాకృష్ణకు ఉన్నట్లే నాకు కూడా అమరావతిలో మంచి సోర్స్‌ ఉంది. అన్ని డిపార్ట్‌మెంట్లలో తెలిసిన అధికారులు ఉన్నారు. అలానే ..ఆ అధికారుల స్నేహితులు నాకు తెలిసినవారు ఉన్నారు. “వైఎస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వంలో కూడా కమ్మ వారికే పనులు అవుతున్నాయి. టీడీపీ వాళ్లు దర్జాగా పని చేయించుకుని వెళ్తున్నారు.

టీడీపీ ప్రభుత్వంలో పెత్తనం చేసిన అధికారుల హవానే వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి వచ్చాక కొనసాగుతుందని నాతో చాలా మంది అన్నారు”. ఇలా నాతో అన్నవారిలో ప్రస్తుత అధికారులు, రిటైర్డ్ అధికారులు, వైఎస్‌ఆర్‌ సీసీ సానుభూతిపరులు ఉన్నారు. చంద్రబాబు అధికారం కోల్పోవడాన్ని బాధాకృష్ణ జీర్ణించుకోలేకపోతున్నారు. దాంతో చెత్త పలుకులో సుత్తి రాతలు రాస్తున్నారు. పతివ్రత పాయశం వండితే తెల్లారే వరకు చల్లారిపోలేదట..!. చెత్త పలుకు రాతలు కూడా పతివ్రత పాయశం వండినట్లే ఉంటాయి. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఓ మాట అన్నారు!” సంక్షేమ , అభివృద్ధి పథకాల్లో కులం, మతం, ప్రాంతం చూడం, అర్హులందరికీ పథకాలు అందేలా చూస్తాం” ఈ మాట ప్రకారమే వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారు. తాజాగా పేదలకు ఇళ్ల స్తలాల మంజూరు విషయంలో ముఖ్యంగ తమ వ్యతిరేక పార్టీ వారనిఅర్హులను ఉపేక్షించకండని పత్రికా ముఖంగా ప్రకటించడం గమనార్హం!!అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యా దీవెన పథకాల్లో టీడీపీ వాళ్లకు కూడా బ్యాంకుల్లో డబ్బులు పడ్డాయి. అత్యంత పారదర్శకతతో సచివాలయాలు ద్వారా సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూస్తున్నారు.

ఈ లబ్ధిదారుల్లో కమ్మవారు లేరని బాధాకృష్ణ చెప్పగలరా?!నాకు కమ్మ కులానికి చెందిన స్నేహితుడు ఉన్నాడు. టీడీపీకి వీరాభిమాని. అతను నాతో అన్న మాట రాయాల్సిన అవసరమొచ్చింది. ఎందుకంటే నిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరముంది. “మా అమ్మ వయసులో చాలా పెద్దది. నెలనెల పంచాయతీ ఆఫీస్‌కు వెళ్లి పింఛన్‌ డబ్బులు తెచ్చుకోవాలి. పింఛన్ కోసం వెళ్లి ఆమె ఎక్కడ పడిపోతుందేమోనని భయపడేవాడిని, ఇప్పుడు జగన్‌ ఇంటికే పింఛన్‌ పంపిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది” అని నాతో అన్నాడు. ఈ మాటలు అన్నది ఓ కమ్మ కులస్థుడే.

ఇది చదివిన తరువాత కూడా బాధాకృష్ణ వైఎస్‌ జగన్ కమ్మద్వేషి అని చెప్పడానికి, రాయడానికి సిగ్గుపడాలి. కమ్మవాళ్లలో అందరూ మంచివారు ఉండరు!రెడ్లలో అందరూ చెడ్డవారు ఉండరు!! అలాగే ఇతర కులాలు సైతం!మీరు చెప్పినట్లు కొంత మంది రెడ్లు టీడీపీకి ఓటేశారు. కొంత మంది కమ్మలు వైఎస్ఆర్‌ సీపీకి ఓటేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరికీ ఓటు వేయాలనేది ఓటరు ఇష్టం. పాలనలో కూడా ఏదీ మంది, ఏదీ చెడు , ఎలా నిర్ణయాలు తీసుకోవాలనేది పాలకుల ఇష్టం. అయితే..సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్న విమర్శించడమే పనిగా పెట్టుకున్న ఎల్లో మీడియాకు చెప్పినా అర్ధం కాదు.

ఎందుకంటే..అంబానీ వచ్చి వైఎస్‌ జగన్‌ కలిస్తే పెడర్ధాలు తీస్తారు. దేశంలోనే బెస్ట్ సీఎంగా వైఎస్‌ జగన్‌ వస్తే ఎల్లో మీడియాలో చిన్న వార్త కూడా రాయరు. వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయాలు దేశంలోని అనేక రాష్ట్రాలు ఫాలో అవుతుంటే ఎల్లో మీడియాకు కనిపించదు. “కళ్లకు గంతలు కట్టుకోకుండానే కట్టుకున్నట్లు నటిస్తాయి ఎల్లో మీడియా కెమెరాలు”.దేశంలో చంద్రబాబును మించిన కుల నాయకుడు ఎవరైనా ఉంటారా?!!. చంద్రబాబును మించిన అవినీతిపరుడు ఎవరైనా ఉంటారా?. అమరావతి పరిసర ప్రాంతాల్లో కమ్మ కులస్థులు ఎక్కువుగా ఉన్నారనే కదా చంద్రబాబు అక్కడ రాజధాని ఉండాలని తలపెట్టింది. ఇది నిజం కాదా బాధాకృష్ణాగారు. చంద్రబాబు వ్యవస్థల్లోకి కులాన్ని జొప్పించింది నిజం కాదా?. తమ కులంవారే అన్ని రంగాల్లో ఉండాలని , మిగిలిన కులాలను పక్కన పెట్టింది నిజం కాదా?. చంద్రబాబు, లోకేష్ కోటరీ మొత్తం కమ్మ కులస్థులే అనేది నిజం కాదా?!!. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు దోచిపెట్టింది కమ్మ కులస్థులకే అనేది నిజం కాదా?!!. ఇవేవీ ‘కమ్మ’ని కలాలకు, కెమెరాలకు కనిపించవు. ‘కమ్మ’ ని కలాలకు, కెమెరాలకు కనిపించేది , వినిపించేది వైఎస్‌ జగన్‌ మాటలు. బాధాకృష్ణకు సూటిగా కొన్ని ప్రశ్న వేయాలి అనుకుంటున్నా?!స్టేట్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ సామాజిక కోణంలో ఎన్నికలు వాయిదా వేయలేదా?!!. నిమ్మగడ్డ రమేష్ ఎన్నికలు వాయిదా వేస్తూ సంతకం చేసిన లెటర్‌ కూరగాయాల కొట్టు నుంచి వచ్చింది కాదా?!!. కరోనా వస్దుందనే ఎన్నికలు వాయిదా వేశామని చెప్పుకొచ్చిన రమేష్ కు వైధ్య , ఆరోగ్య శాఖ నుంచి రిపోర్ట్ అడగాలని తెలియదా?!!. ఎన్నికలను వాయిదా వేసే సమయంలో ప్రభుత్వాన్ని సంప్రదించాలని తెలియదా?. ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని, ఇష్టమొచ్చినట్లు పోలీస్‌ అధికారులను ట్రాన్స్‌ఫర్లు చేస్తామంటే ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోవాలా?!!. ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాలు కోర్ట్ తలుపులు తట్టకూడదా?!!. ఎన్నికల కమిషన్ ఓ నిర్ణయం తీసుకుంటే,ఆ నిర్ణయం ఏకపక్షంగా ఉంటే ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వం చేతులు కట్టుకుని ప్రేక్షక పాత్ర పోషించాలా?. రాజ్యాంగ నిబంధనలు, వ్యవస్థలు ఏం చెబుతున్నాయో తెలియని నిమ్మగడ్డ రమేష్ స్టేట్ ఎలక్షన్‌ కమిషన్ పదవికి అర్హుడా?!!. ఈ ప్రశ్నలకు బాధాకృష్ణ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.‘‘వెధవలకు పదవులు, గాడిదలకు కొమ్ములొచ్చినా ప్రమాదమే’’ అని స్పీకర్ అన్నారని రాశారు. అయితే ఈ మాటలను ఎవరికి అన్వయించాలి అన్నదే ఇప్పుడు ప్రశ్న అంటూ ఆ లైన్‌ ముగించారు. దీనిని నేను కొంచెం పొడిగిస్తాను. ” వెధవలకు పదవులు, గాడిదలకు కొమ్ములు, విలువల్లేని వారి చేతిలో కలాలు” ఇది సమాజానికి చాలా ప్రమాదకరం. రోగం వచ్చిన వాడిని డాక్టర్‌ ఎలా కాపాడుతాడో, సమాజానికి రోగం వస్తే కూడా జర్నలిస్ట్‌లు డాక్టర్ల కాపాడాలి. కాని..ఎల్లో జర్నలిస్ట్‌లు మాత్రం తాము రాసిందే వేదమని, తాము రాసిందే ప్రజలు నమ్మాలని అనుకోవడం పొరపాటు. ఎన్నికల కమిషన్ స్వతంత్రప్రతిపత్తి గురించి చంద్రబాబు, ఎల్లో మీడియా గొంతులు చించుకుంటున్నాయి.

గోపాలకృష్ణ ద్వివేదితో చంద్రబాబు ఎన్నికలకు ముందు ఏం మాట్లాడారో ఎల్లో మీడియాకు ప్లే చేసే దమ్ముందా?!!.కాకి కోకిల అవుతుందా?. కుక్క సింహం అవుతుందా?. కాదు కదా అలానే చంద్రబాబు ఎప్పటికీ ప్రజాసేవలో వైఎస్‌ఆర్‌ కుటుంబంతో పోల్చుకోకూడదు. బాధాకృష్ణ తాను తెలివిగల జర్నలిస్ట్‌నని అనుకోకూడదు. బాధాకృష్ణ రాతలు “జర్నలిజానికి తక్కువ, కులానికి ఎక్కువ”. చంద్రబాబు ప్రజాసేవ గురించి మాట్లాడటమంటే దోపిడీ దొంగలు నీతిసూత్రాలు చెప్పడం లాంటిది. ఇప్పటికైనా చంద్రబాబు ఎల్లో మీడియా చాటున, కులం చాటున, పెయిడ్ ఆర్టిస్ట్‌ల చాటున, అనుకూల అధికారుల చాటున దాక్కోని యుద్ధం చేయకుండా , ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్‌ జగన్‌ ప్రజల కోసం పోరాడినట్లు పోరాడాలి.

ప్రభుత్వంలో ఏవైనా తప్పులుంటే ఎత్తి చూపాలి. అంతేకాని..వైఎస్‌ జగన్‌ తీసుకునే ప్రతి నిర్ణయం తప్పు అని చెప్పినా, రాసినా నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఒక వేళ ఎల్లో మీడియాలో ప్రసారం చేసినా రిమోట్ చేతిలో ఉంటుందనే విషయాన్ని ఎల్లో పాలకులు, మీడియా మరిచిపోకూడదు.చెత్త పలుకు చివరిలో కులం కాదు గుణం మఖ్యమని రాశారు. మంచిదే. గుణంలేనివాడే కులం..కులం అని కలవరిస్తాడని రాశారు . ఇది కూడా కరక్టే. కులం..కులం అని 40 ఏళ్లుగా కలవరించి అందలాలు ఎక్కింది ఎవరో నాకంటే మీకు బాగా తెలుసు సార్‌..?!!

. —వై.వి.రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్.***#MVK_VSP_#కొసమెరుపు!మన 40 ఇయర్స్ పొలిటికల్ జాకాల్ గారికి!జాతీయ స్తాయిలో రాజకీయ విశ్లేషకులు ఏమని భావిస్తారో ఈ చిత్రం చెబుతుంది చాలు!!***

Share

Comm


TAG


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *