విపక్ష టీడీపీ ఎన్నడూ లేనంత పతనావస్ధకు

225

ఏపీలో గతేడాది కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఏడాది పాలన ఆ పార్టీ నేతలకు ఏమాత్రం సంతృప్తి నిచ్చిందో పక్కనబెడితే విపక్ష టీడీపీని మాత్రం ఎన్నడూ లేనంత పతనావస్ధకు చేర్చింది. అధికార పార్టీపై పోరాటం దేవుడెరుగు, కనీసం ఉనికి కాపాడుకుంటే చాలనే పరిస్ధితి రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో కనిపిస్తుండటం నాలుగు దశాబ్దాల అనుభవమున్న టీడీపీతో పాటు అధినేత చంద్రబాబుకు సైతం పీడకలగా మారిపోతోంది.

151 సీట్ల భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ సుస్ధిర ప్రభుత్వం నడుపుతోంది. విపక్షాల పరిస్ధితి ఎన్నడూ లేనంత ఘోరంగా మారిపోయింది. ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని రాజీనామాలు చేయించాకే వైసీపీలోకి తీసుకుంటామని జగన్ హామీ కూడా ఇచ్చారు కాబట్టి తమకు ఎలాంటి ఇబ్బంది లేదని భావించిన టీడీపీకి ఇప్పుడు మిగిలిన ఎమ్మెల్యేలు 20 మందే. వీరిలోనూ ఏడుగురు ఫిరాయింపుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. నేరుగా వైసీపీలోకి ఫిరాయించకపోయినా ఆ పార్టీకి మద్దతునిస్తారు. అదే జరిగితే టీడీపీకి మిగిలే ఎమ్మెల్యేలు 13 మందే. దీంతో ఆ పార్టీ ప్రధాన విపక్ష హోదా కోల్పోతుంది. అటు చంద్రబాబు కూడా విపక్ష నేత హోదా కోల్పోవాల్సి వస్తుంది. ఈ పరిస్ధితి టీడీపీ కలలో కూడా ఊహించలేదు.

వైసీపీ రాకతో బీసీలు దూరం..

ప్రాజెక్టులు, కాంట్రాక్టులూ దూరం….

మద్యం షాపులు దూరం…

రియల్ ఎస్టేట్ కుదేలు…

ఇసుక, మైనింగ్ కార్యకలాపాలు..కుదేలు…

అమరావతి కమ్మ ని రాజధాని కల…..

శాసన మండలి రద్దుతో …. టీడీపీ భూస్థాపితం
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *