విశ్వం – సృష్టికర్త

891

ఈ విశ్వం సృష్టికర్త ఎవరు?
బ్రహ్ళాలేక విష్ణుమూర్తా?
మరి విష్ణుమూర్తి నాభిలోంచి బ్రహ్మ పుట్టాడా?
ఏది వాస్తవం?
ముందు ఇద్దర్ని మనం తెలుసుకుంటే తరువాత వాస్తవాలన్నీతెలుస్తాయి. పరబ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ అని వీరిద్దరికి పేర్లు, పరబ్రహ్మనే పరమాత్మ అనీ, బ్రహ్మ అనీ, నారాయణమూర్తి అనీ, సర్వేశ్వరుడనీ అంటారు. సర్వేశ్వరుడంటే సర్వ నియామకుడని అర్థం. నారాయణమూర్తి నాభి కమలంలోంచి చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించాడు. వెంటనే వేదరాశి అంతా ఆయనకు ఉపదేశింపబడి తన నాలుగు ముఖాలతో నాలుగు వేదాలను అనుసంధించడం ప్రారంభించాడు. వేదానుసారం సృష్టికార్యం చేపట్టాడు. ఇక్కడ ఒక ముఖ్య విషయం గమనించాలి. సృష్టి చేసేవాడు పరమాత్మే బ్రహ్మాండాలని, బ్రహ్మాండంలో చతుర్ముఖ బ్రహ్మల్నీ నేరుగా తానే సృష్టిస్తాడు. దీన్నే అద్వారక సృష్టి (డైరక్ట్ క్రియేషన్) అంటారు. ఇక బ్రహ్మాండంలో ఉండే మిగిలిన సృష్టి అంతా చతుర్ముఖ బ్రహ్మ ద్వారా జరుగుతుంది. గనుక దీన్ని సద్వారక సృష్టి (ఇండైరక్ట్ క్రియేషన్) అంటారు.
ఇలా ఈ బ్రహ్మ సంకల్పించగానే ఆయన మనస్సులోంచి సనకుడు, సనందనుడు, సనత్ కుమారుడు, సనత్ సుజాతుడు అనే నలుగురు బాలుర వంటి కుమారులు పుట్టారు. అపుడు చతుర్ముఖ బ్రహ్మ వాళ్ళని సృష్టికార్యాన్ని కొనసాగించమంటే వాళ్ళమావల్ల కాదంటూ తపస్సుకు వెళ్ళిపోయారు. దాంతో చతుర్ముఖ బ్రహ్మ ఆగ్రహిస్తాడు. అపుడు ముడివడిన ఆయనకనుబొమల నుండి రుద్రుడు పుడతాడు.
ఆ రుద్రుడిని బ్రహ్మాండంలో జరగవలసిన సంహార ప్రక్రియకు అధిపతిని చేశాడు చతుర్ముఖ బ్రహ్మ అపుడా రుద్రుడికి అంతర్యామిగా పరమాత్మ ప్రవేశించి రుద్రునికి సంహారశక్తి (సత్తని కలిగించాడు.
అప్పడు చతుర్ముఖ బ్రహ్మ సంహారానికి రుద్రుడు సిద్ధమయ్యేసరికి, స్థితి (రక్షణ, నిర్వహణ)కి ఎవరు అన్న ప్రశ్న వచ్చింది. చతుర్ముఖ బ్రహ్మ ప్రార్ధనపై, పరమాత్మ తానే ప్రద్యుమ్న రూపంలో రక్షణకర్తవ్యాన్ని నిర్వర్తించడానికి విష్ణువుగా అవతరించాడు. ఇలా బ్రహ్మ విష్ణు, మహేశ్వరులే త్రిమూర్తులుగా ప్రసిద్ధికెక్మారు.
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *