మొదట్లో అలా నన్ను చాలా మంది పిలిచారు. కానీ దాని అర్థం నాకు ఎంత మాత్రం

240

సీనియర్ నటీమణులు కూడా ఇటీవల బడా నిర్మాతలకు సంబంధించిన ప్రవర్తన గురించి చెప్పడం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మీటూ కామెంట్స్ తగ్గుతున్నాయని అనుకున్న సమయంలో షెర్లిన్ చోప్రా మరోసారి మీటూ వివాదంపై కొత్త తరహా కామెంట్స్ చేసింది.

ఎవరైనా కమిట్మెంట్ కోసం మనల్ని అడగాలని అనుకుంటే ఒక కోడ్ వాడతారని షెర్లిన్ ఈ విధంగా వివరణ ఇచ్చింది. ‘కెరీర్ మొదట్లో నేను అవకాశాల కోసం ప్రయత్నం చేస్తుండగా నన్ను చాలా మంది కమిట్మెంట్ అడుగుతూ ఇబ్బంది పెట్టారు. అందులో చాలా మంది సినీ పెద్దలు ఉన్నారు. అయితే ఎక్కువగా అందరు వాడే ఒకే ఒక్క కోడ్.. డిన్నర్ కి రమ్మనడం.. అలా పిలిచారు అంటే కమిట్మెంట్ కోసమే’ అని షెర్లిన్ తెలిపారు.

మొదట్లో అలా నన్ను చాలా మంది పిలిచారు. కానీ దాని అర్థం నాకు ఎంత మాత్రం అర్థం అయ్యేది కాదు. రాత్రి 11-12 గంటల మధ్యలో డిన్నర్ కి రావాలి అంటూ పిలిచేవారు. ఇదేదో తేడాగా ఉందని నేను ముందు జాగ్రత్తగా రిజెక్ట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ విధంగా నేను మిస్ చేసుకున్న అవకాశాలు కూడా ఎన్నో ఉన్నాయి అంటూ షెర్లిన్ చోప్రా తనకు ఎదురైన అనుభవాల గురించి వివరణ ఇచ్చింది.




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *