భారత్‌తో యుద్ధం చేసైనా సరే భూభాగాన్ని తీసుకోవాలని చైనా – చైనా తో యుద్హం ద్వారా ప్రపంచానికి భారత్ అంటే ఏమిటో చూపాలి అని ఇండియా

1009

భారత్‌తో యుద్ధం చేసైనా సరే భూభాగాన్ని తీసుకోవాలని చైనా భావిస్తున్నట్లుగా ఆ దేశ వ్యూహాత్మక నిపుణులు అంచనా వేస్తున్నట్లు చైనా దేశ పత్రికలు పేర్కొంటున్నాయి.భూటాన్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ డోకా లా ప్రాంతంలో చైనా నిర్మిస్తున్న రోడ్డును భార‌త సైన్యం అడ్డుకుంటున్న నేపథ్యంలో మూడు దేశాల స‌రిహ‌ద్దుల వ‌ద్ద ప్ర‌స్తుతం ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం తెలిసిందే.
సరిహద్దు వద్ద ఉద్రిక్తత భార‌త జ‌వాన్లే అక్ర‌మంగా త‌మ భూభాగంలోకి ప్ర‌వేశించార‌ని చైనా ద‌ళాలు మ్యాప్‌ విడుదల చేయడమే కాకుండా, ఇండియన్ జ‌ర్నలిస్టుల‌ ప్ర‌వేశాన్ని కూడా చైనా ర‌ద్దు చేసిన నేప‌థ్యంలో భార‌త్ కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. యుద్ధ ప‌రిస్థితి వ‌స్తే చైనా, పాక్‌ల‌ను ఎదుర్కునేందుకు భార‌త ఆర్మీ సిద్ధ‌మ‌ని ఇండియన్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల కూడా చైనా స్పందిస్తూ ప‌లు వ్యాఖ్య‌లు చేసింది. యుద్ధం వచ్చే పరిస్థితి..
ఈ ప‌రిస్థితుల‌పై స్పందించిన చైనా నిపుణులు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. డోకాలా వివాదంపై ఇరు దేశాల మ‌ధ్య యుద్ధం వ‌చ్చినా ఆశ్చ‌ర్యం లేద‌ంటున్నారు. స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌ విష‌యంలో ఇరు దేశాలు వెన‌క్కి త‌గ్గేలా లేవ‌న్నారు. అవ‌స‌ర‌మైతే యుద్ధానికి కూడా వెళతాయని, డోకాలా స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌ను స‌రిగా తీర్చుకోలేక‌పోతే యుద్ధం ఉత్ప‌న్న‌మ‌య్యే అవ‌కాశాలున్న‌ట్లు చెప్పారు. ఇరు దేశాలు ఆ స‌మ‌స్య‌పై చ‌ర్చ‌లు జరపాలని సూచించారు. పత్రిక కథనం…
చైనా తన సరిహద్దు సార్వభౌమాధికారాన్ని కచ్చితంగా రక్షించుకొని తీరుతుందని, అవసరమైతే యుద్ధం చేసైనా సరే అని చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ పత్రిక ప్రచురించింది. ఇది నిపుణుల సలహా అదే సమయంలో ఇరు దేశాలు యుద్ధం గురించి ఆలోచించడం మాని అభివృద్ధి గురించి ఆలోచించాలని కూడా నిపుణులు హితవు పలుకుతున్నట్లు పత్రిక పేర్కొంది.
ఈ రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే అది మరిన్ని దేశాలకు ఊతం ఇచ్చినట్లవుతుందని, మంచి సంబంధాలు ఇరు దేశాలకు మేలు చేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నట్లు పేర్కొంది. ట్రంప్ హెచ్చరించారంటూ రష్యా వార్నింగ్ చైనా తీరుపై రష్యా మీడియా మండిపడింది. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌ను విస్తరించుకుంటోన్న చైనా… అదే స్థాయిలో శత్రువులను కూడా పెంచుకుంటోందని పేర్కొంది. దక్షిణ చైనా సముద్రం అంశంలో చైనా తీరును తీవ్రంగా త‌ప్పుబ‌ట్టింది.
 
ట్రీటోన్ దీవులు తమవేనని చైనా పేర్కొంటున్న తీరుతోనే ఆ దేశ అధినాయకత్వం ఎంత దూకుడుగా ఉందో తెలుస్తోంద‌ని విమర్శించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ కూడా ఈ అంశంలో చైనా తీరుని తప్పు పట్టారని తెలిపింది. చైనా అధ్యక్షుడికి ట్రంప్ ఫోన్ చేశార‌ని, పొరుగుదేశాలతో స‌త్సంబంధాలు కలిగి ఉండాలని చెప్పార‌ని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని అన్నార‌ని రష్యా మీడియా పేర్కొంది. చైనా జపాన్‌తో పాటు భార‌త్‌తోనూ ఘ‌ర్ష‌ణ పూరిత వాతావ‌ర‌ణంతో ముందుకు వెళుతోంద‌ని పేర్కొంది. ఈ తీరును మార్చుకోక‌పోతే చైనా తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పింది.
ఇది చైనా తీరు భార‌త్‌ను ఈశాన్య రాష్ట్రాల‌తో క‌లిపే డోఖ‌లా ప్రాంతంలోని సిలిగురి కారిడార్ త‌మ సైన్య సౌక‌ర్యార్థం సిక్కిం-భూటాన్‌-టిబెట్‌ల‌ను క‌లుపుతూ చైనా మార్గం నిర్మించాల‌నుకుంటోంది. వివాదాస్ప‌ద ప్రాంతంలో మార్గం నిర్మించే ప్ర‌య‌త్నాల‌ను భార‌త ఆర్మీ అడ్డుకుంది. జ‌మ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ వ‌ర‌కు 3,488 కి.మీ.ల మేర చైనాతో భార‌త్‌కు ఉన్న స‌రిహ‌ద్దులో 220 కి.మీ.లు సిక్కింలో ఉంది.
1962 గుర్తు చేశారుగా.. కానీ సిక్కింలో ప్ర‌వేశిస్తున్న వారి ద‌ళాల‌ను అడ్డుకున్నందుకు చైనా ‘1962లో జ‌రిగిన సంఘ‌ట‌న దృష్టిలో పెట్టుకొని ముంద‌డుగు వేయండి, లేదంటే మ‌మ్మ‌ల్ని ముందుకు రానీయండి’ అంటూ భార‌త సైన్యాన్ని హెచ్చ‌రించింది. దీనిపై జైట్లీ ఘాటుగా స్పందించారు. ‘1962 సంగ‌తి గుర్తు చేశారుగా… అప్పుడున్న భార‌త్ ఇప్పుడున్న భార‌త్ వేర్వేరు అనే విష‌యం మీరు కూడా గుర్తుతెచ్చుకోండి’ అన్నారు.
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *